కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి వాకౌట్ చేసిన తెలంగాణ అధికారులు
KRMB Meeting: కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు.
KRMB Meeting: కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని తెలంగాణను ఏపీ అధికారులు కోరారు. ఈ క్రమంలోనే సాగు, తాగు నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయాలని కేఆర్‌ఎంబీ ఛైర్మన్ కూడా తెలంగాణ అధికారులకు సూచించారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కాగా కేఆర్‌ఎంబీ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది.