తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ అలజడి..ఏ క్షణానైనా పీసీసీ ప్రకటన?

Telangana: కేరళ పీసీసీ ప్రకటనతో ఢిల్లీ బాట పట్టిన నేతలు

Update: 2021-06-12 13:42 GMT

కాంగ్రెస్‌ పాత చిత్రం

Telangana: టీ-కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ వ్యవహారం కాకరేపుతోంది. త్వరలోనే పీసీసీ ప్రకటన ఉంటుందన్న వార్తల నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మళ్లీ హస్తిన బాట పడుతున్నారు. ఆ నలుగురు సీనియర్ లీడర్లు ఢిల్లీకి వెళ్లడంతో పీసీసీ ప్రకటన రేపో.. మాపో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు, త్వరలోనే పీసీసీ ప్రకటన ఉంటుందన్న వార్తల్లో నిజమెంత..? హస్తిన బాట పట్టిన ఆ నలుగురు నేతలు ఎవరు..? వాచ్ దిజ్ స్టోరీ..

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ అలజడి రేగుతోంది. సాగర్ బైపోల్‌కు ముందు ప్రకటన వస్తుందని భావించినా.. ఉప ఎన్నిక కారణంగా వాయిదా వేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. అయితే, సాగర్ రిజల్ట్స్ వచ్చి రెండు నెలలు పూర్తయినా పీసీసీ ప్రకటనపై ఎటూ తేల్చకపోవడంతో ఇప్పట్లో కొత్త కమిటీ ఉంటుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా కేరళకు కొత్త పీసీసీని ప్రకటించడంతో తెలంగాణలోనూ పీసీసీ పోరు షురూ అయింది. తెలంగాణతోపాటు పంజాబ్ పీసీసీ కూడా రెడీగా ఉన్నారు.. ప్రకటన మాత్రమే ఆలస్యం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇలాంటి ఊహాగానాల నేపధ్యంలో ఆశావహులంతా ఢిల్లీ బాట పట్టారు. పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్న రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ హస్తినకు బయలు దేరారు. ఏ క్షణానైనా పీసీసీ ప్రకటన రావొచ్చనే అంచనాలతో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధినేత్రి సన్నిహితులను రహస్యంగా కలుస్తున్నట్లు తెలుస్తోంది. అటు.. ఏఐసీసీ పిలుపుతో పెట్రో నిరసనల్లో కూడా కోమటిరెడ్డి హాజరు కాలేదు. ఇటు.. శుక్రవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ కుటుంబ సమేతంగా హస్తినకు చేరుకున్నారు. రేవంత్ సోనియాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు.. పీసీసీ రేసులో ఉన్న భట్టి, మధుయాష్కీలు సైతం కాంగ్రెస్ పెద్దలకు అందుబాటులో ఉండేందుకే ఢిల్లీ వెళ్లారన్న చర్చ ఊపందుకుంది.

ఇదిలా ఉంటే.. రేవంత్, కోమటి రెడ్డిల మధ్య గట్టి పోటీ ఉండడంతో ఇద్దరిలో ఎవరో ఒకరికి పీసీసీ పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. దీనికితోడు ఇప్పటికే రేవంత్‌కు పీసీసీ ఫైనల్ అయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మిగతా ముగ్గురు నేతలను ఏఐసీసీలో కొత్త పదవుల కోసం పిలిపించారని వార్తలు వినిపిస్తున్నా.. అధిష్టానమే పిలిచిందని ఎవరూ కన్ఫర్మ్ చేయట్లేదు. ఇక.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రస్తుత పీసీసీ ఉత్తమ్‌ ఢిల్లీకి వెళ్లకపోవడం కొసమెరుపని చెప్పాలి.


Tags:    

Similar News