Telangana: కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

*ఐదు చోట్ల జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ *మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

Update: 2021-12-14 03:10 GMT

కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ పోలింగ్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదుచోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 25 చొప్పున పోలైన ఓట్లను కట్టలుగా కట్టి లెక్కిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. కాగా.. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర పోలీసులు పట్టిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం కల్లా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అధికార పార్టీ అభ్యర్థులు ఎల్.రమణ, భాను ప్రసాదరావు, స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే రవీందర్ సింగ్ సాధించే ఓట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఫలితాల ప్రకటన అనంతరం ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదన్నారు అధికారులు. గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు అనుమతించనున్నామన్నారు.

Tags:    

Similar News