Coronavirus: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా గిరిజన అభివృద్ధి శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా సోకింది. ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ ఉదయం కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆమె హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు, తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.