Sabitha Indra Reddy: ఫెయిల్ అయిన విద్యార్థులంతా పాస్
*ఇంటర్ ఫస్టియర్‌లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్.. అందరినీ పాస్ చేయాలంటూ విద్యార్థులు, ప్రతిపక్షాల ఆందోళన
Sabitha Indra Reddy: ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై మంత్రి స్పందించారు. "పార్టీలను పక్కనపెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని.. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొద్దని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఇంటర్ విద్యార్థులందరికీ మినిమం 35 మార్కులు ఇచ్చి అందిరినీ పాస్ చేస్తున్నామని ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మంచి మార్కులు సాధించాలని ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్ సెకండియర్‌లో కూడా పాస్ చేస్తారని ఆశించవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.