జేపీ నడ్డా వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

కరోనా విషయంలో ప్రతిపక్షపార్టీలు రాజకీయాలు చేయాలని చూడటం దారుణమని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Update: 2020-06-21 13:30 GMT
Harish Rao (File Photo)

కరోనా విషయంలో ప్రతిపక్షపార్టీలు రాజకీయాలు చేయాలని చూడటం దారుణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు. జేపీ నడ్డా వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి ట్విటర్ ను వేదికగా చేసుకుని పేర్కొన్నారు.

' దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్న వైద్యులు ఒక్కటే అని కదా మనం అనుకుంటున్నది అని ఆయన ట్వీట్ చేసారు. దేశ రక్షణ విషంలో ప్రభుత్వాలపై విమర్శలు చేయడం అనుచితం కాదని మీరే అంటారు అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా సైనికులు, వైద్యులు ఒక్కటే అన్నారు కదా అంటూ హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా? దేశానికి వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీరే వైద్యులు చేస్తున్న కృషిని తక్కువ చేసి చూపడం సబబా?అని ప్రశ్నించారు. ఇది వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసే చర్య కాదా? ' అని ఆయన పేర్కొన్నారు. 'మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. మానవాళి మనుగడకే సవాలుగా మారిన కరోనా విషయంలో రాజకీయాలు చేయడం దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లడడంతో సమానం అని అన్నారు. దయచేసి ఇది గుర్తుంచుకోవాలని జేపీ నడ్డాను కోరుతున్నా. సైనికుల నైతికస్థైర్యం దెబ్బతీస్తుందని ఉద్బోదిస్తారు అని పేర్కొన్నారు.


Tags:    

Similar News