Telangana Live Updates: తెలంగాణ జిల్లాల తాజా వార్తలు

Telangana: తెలంగాణ జిల్లాల తాజా వార్తలు

Update: 2021-02-21 00:55 GMT

తెలంగాణ (ఫోటో ది హన్స్ ఇండియా)

వనపర్తిలో:

వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్రం పెట్రోలు, వంటగ్యాస్ ధరలను అనునిత్యం పెంచుతూ ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిరసనకు దిగారు. పెట్రోల్‌ ధరల పెంపనకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్‌‌చౌక్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు ఎద్దుల బండి మరియు ఆటో బైకులను లాగుతూ నిరసన వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌ జిల్లా:

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ కేంద్రంగా జారీ చేసిన దొంగ పాస్‌పోర్టుల డొంక కదులుతోంది. ఒకే ఇంటి చిరునామాతో 32 పాస్‌ పోర్టులు జారీ కావడంపై పోలీసులు విచారణ చేపట్టారు. స్పెషల్ బ్రాంచ్‌ ఎస్‌.ఐ ఇంటి నుంచి రోహింగ్యాలకు 32 పాస్‌పోర్టులు జారీ అయినట్లు గుర్తించారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో:

వరంగల్ అర్బన్ జిల్లాలో ఆంజనేయ స్వామి ఆలయ స్థలం వివాదంలో చిక్కుకుంది. గత ముప్పై ఏళ్లుగా ఆలయ అభివృద్ధికి కృషిచేస్తే.. ఇప్పుడు స్థల యజమాని ఆలయ అర్చకుడిని స్థలం కోసం బెదిరిస్తున్నాడని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సర్వ హక్కులు ఉన్నప్పటికీ న్యాయం జగరగడం లేదని.. తనకు న్యాయం జరిగేంత వరకు గుడి ముందే బైఠాయిస్తానంటున్నారు స్థల యజమాని సత్య ప్రకాష్ మిశ్రా.

మహబూబ్‌నగర్ జిల్లా: 

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని నాగారం, వెంకటాయపల్లి, గద్దెగూడెం, చిన్నారాజమూర్, అజీలపూర్, బొల్లారం గ్రామాల పరిధిలో రెండు నెలలుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. నాగారం కొత్త క్రషర్ వద్ద చిరుతపులి స్థానికుల కంటపడింది. క్రషర్ పనిచేసే కార్మికులు చిరుతను తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

నల్గొండ జిల్లా:

నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలోని చెర్వుగట్టులో రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజామున వైభవంగా శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవం జరిగింది. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Tags:    

Similar News