Telangana HC slams KCR govt for Corona Testing: కరోనా పరీక్షల నిర్వహాణ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం .
Telangana HC slams KCR govt Low Corona Testing : తెలంగాణలో కరోనా పరీక్షలు, రోగులకు అందుతున్నచికిత్స తీరుపై ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో విమర్శలను అందుకుంటుంది.
Telangana HC slams KCR govt Low Corona Testing: తెలంగాణలో కరోనా పరీక్షలు, రోగులకు అందుతున్నచికిత్స తీరుపై ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో విమర్శలను అందుకుంటుంది. ఈ అంశంలో హైకోర్టు సైతం పలు మార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు కూడా వేసింది. మరో పక్కన విపక్షాలు పక్క రాష్ట్రంలో పెద్ద మొత్తంలో టెస్ట్‌లు చేస్తున్నప్పటికీ తెలంగాణలో చేయడం లేదని మండిపడుతున్నాయి. తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవించే హాక్కును కాలరాసేవిధంగా ప్రభుత్వం వ్యవహారిస్తుందని మండిపడింది. 17 వ తేదిన కోర్టును నివేదిక సమర్పించాలని, సంతృప్తి చెందక పోతే.. జూలై 20న చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్, హాజరుకావాలని అదేశించింది. హై కోర్టు ప్రభుత్వానికి గతంలో ఇచ్చిన అదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. నివేదికలు సమర్పించకపోతే కోర్టు దిక్కరణగా భావిస్తాంమని తెలిపింది. ఆర్.ఏ.డీ. బ్లడ్ శాంపీల్స్ ఎందుకు చేయకూడదని, 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే పరీక్షలు చేయాలని అదేశించింది.
ఇక పిటిషన్ తరుపు న్యాయవాధి చిక్కుడు ప్రభాకర్, శ్రీరంగ పూజిత 50 వేల టెస్టులు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మూడు రోజలు అసలే టెస్టులు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా ఆర్.ఏ.డీ. శాంపీల్స్ సేకరించాలని పిటిషనర్ విజ్నప్తి చేసారు. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారని ప్రశ్నించారు. ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపీల్స్ ఎన్ని తీసుకున్నారు. జూన్ 26న ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలని హైకోర్టు అదేశించింది. సెంట్రల్ టీం ఎక్కడెక్కడ పర్యటించిందన్న అంశాలను ఈనెల 17న పూర్తి వివరాలు తెలియ జేయాలని ఆదేశించింది. జూన్ 26న టెస్టులు ఎందుకు అపేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. డాక్టర్స్ కు పారమెడికల్ స్టాప్ కి పీ.పీ.ఈ కిట్స్ ఎన్ని ఇచ్చారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఎప్రిల్ 21, జూన్ 8 , జూన్ 18 రోజున ఎన్నెన్ని కిట్స్ ఇచ్చారని ప్రశ్నించింది. 17 వ వరకు అదేశించిన పనులు పూర్తి చేయకపోతే. అధికారులు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసిన హైకోర్టు.
https://telugu.news18.com/news/coronavirus-latest-news/telangana-highcourt-slams-kcr-govt-over-corona-virus-tests-sk-547156.html