ఆ ఎమ్మెల్యేలు..ఎంపీలకు తెలంగాణా హైకోర్టు షాక్!

Telangana High court: తెలంగాణా హైకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Update: 2020-10-03 15:12 GMT

క్రిమినల్ కేసులు, ఇతర కేసులలో విచారణ ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీల కేసులపై ఇక రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లకు ఈమేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణా హైకోర్టు. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను విచారిస్తున్న ప్రత్యెక న్యాయస్థానాలకు కూడా హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా విచారణ వేగవంతం చేయాల్సిందే అని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ ఆదేశాలు పలువురు ఎంపీలు..ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా పరినమించినట్లే. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనే అంశాల విషయంలో క్రిమినల్ కేసులు ఎదుర్కుంటున్నారు. వీరికి తాజాగా తెలంగాణా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇబ్బందిగా మారాయని చెప్పవచ్చు.

అదేవిధంగా నవంబర్ 6 వరకూ కోర్టులు అనుసరించాల్సిన అన్లాక్ విధానాన్ని హైకోర్టు ఈరోజు ప్రకటించింది. ప్రస్తుత విధానంలోనే హైకోర్టులో విచారణలు కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే జిల్లలో కోర్టులు తెరచి భౌతిక విచారణ కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది. 

Tags:    

Similar News