TS High Court: పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు విచారణ
TS High Court: వివరణ ఇచ్చిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
TS High Court: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు విచారించింది. ఈవిషయంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హైకోర్టుకు వివరణ ఇచ్చారు. అయితే అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని హైకోర్టు ప్రశ్నించింది. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని ఆన్‌లైన్ క్లాసులు కూడా కొనసాగుతాయని కోర్టుకు తెలిపారు. అయితే పాఠశాలల్లో పిల్లలు భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయ పడింది. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.