ధరణి పోర్టల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆధార్, కులం వివరాల కోసం ఒత్తిడి చేయొద్దని నవంబర్ 3న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో, మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. సాగు భూములపై సబ్సిడీ పథకాలు అమల్లో ఉన్నందున ఆధార్ వివరాలు అడగొచ్చని అలాగే, ఆధార్‌ను గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోవచ్చని చట్టం చెబుతోందని ప్రభుత్వం తెలిపింది. దాంతో, ప్రభుత్వం దాఖలు చేసిన వెకేట్ పిటిషన్‌పై అభ్యంతరాలకు ఈనె 31వరకు గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది.