TS High Court: మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని తెలంగాణ కోర్టు ఆదేశం

* విద్యాసంస్థల్లో సిబ్బందికి 2 నెల్లలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశం * ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలన్న హైకోర్టు

Update: 2021-09-22 12:00 GMT

తెలంగాణ హైకోర్టు (ఫోటో: ది హన్స్ ఇండియా)

TS High Court: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. విద్యాసంస్థల్లోని సిబ్బందికి రెండు నెలల్లోనే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ధర్మాసనం తెలిపింది. రాడిడ్ యాంటిజెన్ పరీక్షలు పది శాతమే జరుగుతున్నాయని దాంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని తెలిపింది. కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ కార్యచరణ ప్రణాళికలో జాప్యం ఎందుకని ప్రశ్నించింది. రెండు సార్లు ఆదేశించినప్పటికీ ఎందుకు సమర్పించలేదని డీహెచ్‌ను కోర్టు ప్రశ్నించింది.

CCGRA పై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని డీహెచ్ కోర్టుకు తెలిపారు. అయితే దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుంటూ ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా..? కోర్టు ఆదేశాలు అమలు చేయారా అని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది. ఈనెల 30లోగా CCGRA రూపొందించాలని ప్రభుత్వాని ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతమంది మరిణించాక చేరుస్తారని కేంద్రంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అక్టోబరు 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.

Tags:    

Similar News