Breaking News: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

Update: 2020-06-29 05:52 GMT

తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పాత సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ ధాఖలైన పిటిషన్లుపై నేడు విచారించిన ఉన్నత న్యాయస్థానం సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. సుధీర్ఘంగా కొనసాగిన వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.

ఉమ్మడి రాష్ట్రంలో లో నిర్మించిన సచివాలయం కూల్చి దాని స్థానంలో కొత్త సెక్రటేరియట్ కట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రొఫెసర విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిపై హైకోర్టు సుదీర్ఘ వాదనలు విన్నది. సచివాలయ నిర్మాణం అనేది విధాన పరమైన నిర్ణయమని.. ఇందులో కోర్టు జోక్యం చేసుకోవద్దంటూ ప్రభుత్వం వాదించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. మరోవైపు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.

Tags:    

Similar News