Harish Rao: తోమర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి హరీశ్ రావు

Harish Rao: యూపీ, పంజాబ్ ఎలక్షన్‌ కోసమే చట్టాల రద్దు ప్రకటన చేశారని ఫైర్

Update: 2021-12-26 12:30 GMT

తోమర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి హరీశ్ రావు

Harish Rao: వ్యవసాయ చట్టాలపై కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ యూటర్న్ తీసుకున్నప్పటికీ పొలిటికల్ విమర్శలు మాత్రం ఆగడంలేదు. తాజాగా తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సాగు చట్టాల వ్యాఖ్యలపై స్పందించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ సాగు చట్టాలను మళ్లీ తెస్తాననడం యావత్ దేశ రైతాంగాన్ని కించపరచడమే అన్నారు. పరిస్థితి చూస్తుంటే యూపీ, పంజాబ్ ఎలక్షన్‌ కోసమే నల్ల చట్టాలు రద్దు ప్రకటన చేశారని, ఎన్నికల తర్వాత మళ్లీ చట్టాలు తెచ్చే ఛాన్స్ కనిపిస్తోందన్నారు. దీనిపై స్వయంగా ప్రధాని మోడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News