New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు.. ఎప్పటినుంచంటే?
New Ration Cards: తెలంగాణ ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ రానుంది.
New Ration Cards: తెలంగాణ ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ రానుంది. సంక్షేమ ఫథకాలకు కీలకమైన రేషన్ కార్డులను త్వరలో జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలో 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు. కొత్త కార్డులు మంజూరు చేయాలని రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొత్త రేషన్ కార్డులపై ఎలాంటి ప్రకటన అందించలేదు. కొత్తగా పెళ్లీలు చేసుకున్న వారు, పుట్టిన పిల్లల పేర్లను ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చేర్పించాలంటూ ఎన్నో దరఖాస్తులు ఇప్పటికే పెట్టుకున్నారు. కానీ, వీరందరికీ నిరాశే ఎదురవుతోంది.
కాగా, ఇప్పటి వరకు తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే, లబ్ధిదారులు దాదాపు 2 కోట్ల మంది ఉండగా, గత 6 ఏళ్లలో ప్రభుత్వం 20 లక్షల నకిలీ కార్డులను రద్దు చేసింది. అయితే, లబ్ధిదారుల ఫిర్యాదుతో 2 లక్షల రేషన్ కార్డులను పునరుద్ధరించింది.
అయితే, అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కొత్త కార్డుల ప్రక్రియ నిలిచిపోయిందని తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులను మంజురు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.