Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 30 రోజుల్లో హెల్త్ కార్డులు

Digital Health Cards: విద్య, వైద్యం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Update: 2024-09-27 01:33 GMT

Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 30 రోజుల్లో హెల్త్ కార్డులు

Digital Health Cards: విద్య, వైద్యం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎవరైనా ఆస్పత్రికి వెళ్తే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఉందని, హెల్త్ ‌రికార్డులు లేకపోవడం వల్లే తరచూ ఈ విధమైన పరీక్షలు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. అందుకే.. రానున్న నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ను డిజిటలైజ్‌ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

గురువారం ఆయన విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ‘‘మా ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం ముఖ్య లక్ష్యం. ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాల్సి ఉంది. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ డిజిటల్ హెల్త్ కార్డుల్లో గత వైద్యం వివరాలను పొందుపరుస్తాం’’ అని వివరించారు.

క్యాన్సర్ మహమ్మారితో చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆస్పత్రి యాజమాన్యం మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపాదనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి అని పేర్కొన్నారు.

Tags:    

Similar News