సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు
Telangana Govt Releases 400 Crore : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ భవన నిర్మాణానికి గాను .400 కోట్ల రూపాయలను గురువారం మంజూరు చేసింది.
Telangana Govt Releases 400 Crore : కొత్త సచివాలయ భవన తుది నమూనాకు తెలంగాణ మంత్రివర్గం బుధవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ భవన నిర్మాణానికి గాను .400 కోట్ల రూపాయలను గురువారం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేయనుంది. అంతే కాక టెండర్లకు నోటిఫికేషన్ ను కూడా ఒకటి, రెండు రోజుల్లోనే అధికారులు జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అధికారులు చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్స్ పొన్ని, ఆస్కార్ లతో భేటీ అయ్యారు. నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా అన్ని సౌకర్యాలతో నిర్మించాలని తెలిపారు.
ఇక ఇటీవలె సీఎం కేసీఆర్ నిర్వహించిన వరుస సమీక్షల్లో కొత్త సచివాలయ భవనంలో మార్పులు చేర్పులను గురించి సూచించారు. కొత్త భవనంలో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలూ ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, సమావేశాల కోసం మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి ఉండేలా చూడాలని కేసీఆర్ సూచించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని స్పష్టంచేశారు. ఆ మేరకు నిపుణులు డిజైన్ చేసిన తుది నమూనాను బుధవారం నాటి కేబినెట్ సమావేశంలో ఆమోదించారు.