Telangana Govt Give Notice To Junior Colleges : లాక్ డౌన్ సడలింపులు విద్యార్థులకు ఊరట కలిగిస్తున్నా ప్రభుత్వ నిబంధనలు మాత్రం గందరగోళంలో పడేస్తున్నాయి. ఇన్నాళ్లు చదువుకున్న కాలేజ్ ఉంటుందా ఊడుతుందా అనే సంసిగ్ధత నెలకొంది. ఇప్పటికే వెయ్యికి పైగా కాలేజీలకు నోటీసులు అందాయి. అసలు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆ నిబంధనలెంటి..? ప్రైవేట్ కళాశాలలు ఎందుకు అయోమయంలో పడ్డాయి.? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
ప్రభుత్వం విధించిన నిబంధనలు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1586 ప్రైవేట్ జూనియర్ కాలేజీలున్నాయి. వీటి నిర్వహణ గడువు ఈ నెల చివరి వరకు ముగియనుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థుల రక్షణ కోసం కళాశాలల భవనాల్లో ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా ఉండాలంటూ నోటీసులు జారీ చేసింది.
ఫైర్ ఎన్‌వోసీ లభించాలంటే కాలేజీ ప్రాంగణంలో భవనం చుట్టూ అగ్నిమాపక యంత్రం తిరిగేంత చోటు ఉండాలి. దీంతో పాటు అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే ఆర్పేసేలా నీటి పైప్‌లైన్లను అన్ని అంతస్తుల్లో ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు పూర్తి చేయడం అద్దె భవనాల్లో ఉంటున్న ప్రైవేట్ కళాశాలలకు కష్టమే. అయితే కళాశాల భవనం 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉంటే ఫైర్ ఎన్‌వోసీ అవసరం లేదని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఈ ఏడాది మార్చిలో ఉపసంహరించుకుంది. ఫైర్ ఎన్ వోసీ తప్పనిసరి అయితే 1460కి పైగా కళాశాలలు మూతపడే అవకాశముంది. దీంతో విద్యార్ఠులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.