తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు.. ఓ పార్టీకి అనుమతులు.. మరో పార్టీకి కరోనా ఆంక్షలు..

Telangana News: *తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు *బీజేపీ నేతల సభలు, ర్యాలీలకు ప్రభుత్వం పర్మిషన్‌

Update: 2022-01-09 02:05 GMT

తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఓ పార్టీకి అనుమతులు.. మరో పార్టీకి కరోనా ఆంక్షలు..

Telangana News: తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు నువ్వా..? నేనా..? అన్న రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. అధికార పార్టీపై పోరాటాలు చేస్తున్నాయి. అయితే.. ఒక జాతీయ పార్టీ చేసే కార్యక్రమాలు, నిరసనలకు అనుమతులిస్తూ.. మరొక జాతీయ పార్టీ చేసే వాటికి మాత్రం ప్రభుత్వం అనుమతులివ్వకపోవడం.. కొన్ని వివాదాలకు దారితీస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే దూకుడు పెంచుతూ.. ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి పార్టీలు. ఓ వైపు.. టీఆర్‌ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. అటు.. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి హస్తం పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతూ.. పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపుతోంది.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం ఓ పార్టీ కార్యక్రమాలకు పర్మిషన్‌ ఇస్తూనే.. మరో పార్టీకి మాత్రం అనుమతివ్వడంలేదన్న ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలపై హైకోర్టు ఆంక్షలు విధించింది. అయితే.. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి.. బీజేపీ సభలకు, నిరసన కార్యక్రమాలకు, ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం.. రైతుబంధు సంబరాలు నిర్వహిస్తోంది. కానీ. కాంగ్రెస్‌ పార్టీకి వచ్చేసరికి.. హైకోర్టు ఆదేశాల పేరుతో దీక్షలు, శిక్షణా తరగతులకు అనుమతులు నిరాకరిస్తోంది టీఎస్ సర్కార్.

దీంతో.. ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్‌ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. బీజేపీ కార్యక్రమాలను అడ్డుకోని పోలీసులు.. తమ పార్టీ కార్యకర్తలను ముందే హౌజ్‌ అరెస్ట్ చేస్తూ.. సభలు, సమావేశాలను అడ్డుకుంటూ.. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు సభలు, ర్యాలీలు నిర్వహిస్తుంటే ఎందుకు కేసులు పెట్టడంలేదని ప్రశ్నిస్తున్నారు. రైతుబంధు సంబరాల పేరిట మంత్రులు చేస్తున్న ర్యాలీల ద్వారా కోవిడ్‌ వ్యాప్తి జరగదా అని అడుగుతున్నారు. ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే కోవిడ్‌ నిబంధనలు వర్తిస్తాయా అంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.

Tags:    

Similar News