ఫ్లైట్లో ప్రయాణికుడి ప్రాణాలు రక్షించిన గవర్నర్ తమిళిసై

Tamilisai Soundararajan: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ మంచి మనసును చాటుకున్నారు.

Update: 2022-07-23 11:26 GMT

ఫ్లైట్లో ప్రయాణికుడి ప్రాణాలు రక్షించిన గవర్నర్ తమిళిసై

Tamilisai Soundararajan: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ మంచి మనసును చాటుకున్నారు. వారణాసి వెళ్లిన గవర్నర్ శుక్రవారం అర్ధరాత్రి దిల్లీ - హైదరాబాద్ ఇండిగో విమానంలో తెలంగాణకు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణ సమయంలో ఒక వ్యక్తి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులున్నారా?అని అడగడంతో తమిళిసై స్పందించారు. వెంటనే అస్వస్థతకు గురైన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ఉపశమనం కలిగించారు. త‌మిళిసై ప్రాథ‌మిక చికిత్స‌తతో అనారోగ్యం నుంచి తేరుకున్న ఆ ప్ర‌యాణికుడు ఆమెకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఇక సరైన సమయంలో స్పందించిన విమాన సిబ్బందిని కూడా తమిళిసై అభినందించారు. విమానంలో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని విమాన ప్రయాణాల్లో వైద్యులు ఎవరైనా ఉంటే ముందే వారి వివరాలను అందుబాటులో ఉంచేలా చూడాలని అభిప్రాయపడ్డారు. విమాన సిబ్బందికి సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తే బాగుంటుందన్నారు తమిళిసై. సిబ్బందితో పాటు సామాన్యులు కూడా సీపీఆర్ చేసే విధానంపై శిక్షణ తీసుకుంటే ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ గవర్నర్‌గా కొన‌సాగుతున్న త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు వైద్యురాలిగా ప‌ని చేశార‌న్న విష‌యం తెలిసిందే. 


Tags:    

Similar News