Governor Tamilisai Directs To Follow 4T: కచ్చితంగా 4T సూత్రం పాటించండి .. గవర్నర్ తమిళిసై

Governor Tamilisai Directs To Follow 4T: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం కరోనా టెస్టులు చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2020-07-12 16:57 GMT
TS GOVERNOR

Governor Tamilisai Directs To Follow 4T: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం కరోనా టెస్టులు చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆదివారం వచ్చిన రిపోర్టులో ఆమెకి కరోనా నెగటివ్‌గా తేలింది. కొంత మంది రాజ్ భవన్ సిబ్బందికి పాజిటివ్ అని తెలింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ ప్రజలకి కొన్ని సూచనలు చేశారు. కరోనా బారినా పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.

" తాజాగా నేను చేసుకున్న కరోనా టెస్టుల్లో నెగిటివ్ అని తేలింది. కరోనా బాధితులు, రెడ్ జోన్లలలో ఉన్నవారు ఆలస్యంగా చేయకుండా కరోనా పరీక్షలు చేసుకోండి. ముందు చర్యలు తీసుకోవడం వలన మన ప్రాణాలని కాపాడుకున్నాం వాళ్ళం అవుతాం.. అంతేకాకుండా ఎదుటివాళ్ళ ప్రాణాలను కాపాడిన వాళ్ళం కూడా అవుతాం.. ఇందులో వెనుకడుగు వేసి నిర్లక్షంగా వ్యవహరించవద్దు. ముఖ్యంగా '4టీ' అనే సూత్రాన్ని పాటించండి " అని తమిళిసై తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

4టీ అంటే.. టెస్ట్, ట్రేస్‌ (వైరస్ సోకిన వారిని గుర్తించడం), ట్రీట్‌ (చికిత్స), టీచ్ (ఎదుటివాళ్లను ప్రోత్సహించడం) అని గవర్నర్‌ తమిళిసై ట్వీటర్‌లో పేర్కొన్నారు.ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో గవర్నర్ తమిళిసై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..

ఇక తెలంగాణలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి.. ఆదివారం కొత్తగా రాష్ట్రంలో 1,269 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,671 కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 8 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 356 కు చేరింది. గురువారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 800 కేసులు వచ్చాయి. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది. 

Tags:    

Similar News