Bathukamma Celebrations: రాజ్ భవన్ బతుకమ్మ సంబరాల్లో మంత్రులతో కలిసి గవర్నర్ సతీమణి ఆటాపాట.. ఫోటోలు

Update: 2024-10-09 15:38 GMT

Bathukamma Celebrations 2024 at Telangana Raj Bhavan: హైదరాబాద్ రాజ్ భవన్‌లో బుధవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయన సతీమణి సుధా దేవ్ వర్మ పాల్గొన్నారు. వీరితో పాటే పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిక్షు సంక్షేమ శాఖ మంత్రి డా అనసూయ సీతక్క, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా ఈ వేడుకల్లో పాల్పంచుకున్నారు.


ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు తెలంగాణ మహిళలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.


గవర్నర్ సతీమణి సుధా దేవ్ వర్మ బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరించారు.


బతుకమ్మను తీసుకుని రాజ్ భవన్ ప్రధాన భవనం ఎదుట ఉన్న ఆవరణలోకి వచ్చిన ఆమె.. అక్కడే రాజ్ భవన్ సిబ్బంది కుటుంబాలతో కలిసి ఆడిపాడారు.


మంత్రులు కొండా సురేఖ, సీతక్క చెరోవైపు ఉండి సుధా దేవ్ వర్మకు బతుకమ్మ పండగ ప్రాముఖ్యతను, గౌరి పూజ విధానాన్ని వివరించారు.


బతుకమ్మ ఆటపాటల అనంతరం సుధా దేవ్ వర్మ మహిళలు అందరితో కలిసి వెళ్లి అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక నీళ్ల తొట్టిలో బతుకమ్మను విడిచిపెట్టారు.


సుధా దేవ్ వర్మ బతుకమ్మ సంబరాలలో రాజ్ భవన్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆచారవ్యవహారాలను అనుసరించారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరై ఈ వేడుకలను తిలకించారు. 

Tags:    

Similar News