Free Covid Tests in Private Hospital: కరోనాపై తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం..'ప్రయివేట్'లో ఉచితంగా టెస్టులు, చికిత్స..

Free Covid Tests in Private Hospital: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేయడానికి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2020-07-15 11:30 GMT
Representational Image

Free Covid Tests in Private Hospital: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేయడానికి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వ ల్యాబుల్లో మాత్రమే కాకుండా ఇప్పటి నుంచి ప్రయివేటు ఆస్పత్రుల్లో కూడా ఉచిత కరోనా టెస్టులు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతే కాక పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స కూడా ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుందని సమచారం. రాష్ట్రంలో ఉన్న ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనా టెస్టులు, చికిత్స అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే ప్రభుత్వం మూడు ప్రయివేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేశారని కూడా సమాచారం.

ప్రభుత్వం ఎంపిక చేసిన కళాశాలల్లో మమతా మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో చికిత్సను ఉచితంగా అందించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలు తెలియాల్సి ఉంది. ఈ మూడు మెడికల్ కాలేజీల్లో కరోనా వైరస్ పేషెంట్లు, అనుమానితులకు సూచనలు ఇవ్వడం కోసం హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు కాలేజీల్లో కరోనా చికిత్స విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిస్తే మిగతా మెడికల్ కాలేజీల్లోనూ ఈ విధానాన్ని అవలంభించే అవకాశం ఉంది. ఇక ఎంపిక చేసిన కళాశాలల్లో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ మంత్రి మల్లారెడ్డిది కాగా మమతా మెడికల్ కాలేజీ పువ్వాడ అజయ్‌ కుమార్ కుటుంబానికి చెందినది. ప్రభుత్వం ఎంపిక చేసిన మెడికల్ కాలేజీల్లో మల్లారెడ్డి, మమతా మెడికల్ కాలేజీలు మంత్రులకు చెందినవి కావడం గమనార్హం.


Tags:    

Similar News