నీళ్ల బిల్లులు కట్టని వారికి ఇదే మంచి అవకాశం..కేటీఆర్

Telangana government good news : హైదరాబాద్ మహానగరంలో చాలా మంది ప్రతి నెల నల్లా బిల్లులు కట్టకుండా ఉంటారు. అలా ఇప్పటి వరకు కట్టని వారికి ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది.

Update: 2020-08-11 12:28 GMT
నీళ్ల బిల్లులు కట్టని వారికి ఇదే మంచి అవకాశం..కేటీఆర్
కేటీఆర్ ఫైల్ ఫోటో
  • whatsapp icon

Telangana government good news : హైదరాబాద్ మహానగరంలో చాలా మంది ప్రతి నెల నల్లా బిల్లులు కట్టకుండా ఉంటారు. అలా ఇప్పటి వరకు కట్టని వారికి ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది. పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీశాక మంత్రి వెల్లడించారు. మంగళవారం మంత్రి ప్రగతిభవన్‌లో జలమండలి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకం కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు పడిన అసలు బిల్లు కడితే చాలని, వడ్డి చెల్లించనవసరం లేదని కేటీఆర్‌ తెలిపారు. జలమండలికి బిల్లులు క్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు 45 రోజుల పాటు ఈ అవకాశం అమలులో ఉంటుందని మంత్రి తెలిపారు.

జలమండలి సిబ్బంది ప్రతి ఒక్కరు కష్టపడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వసూలు చేసి బోర్డు ఆదాయం పెంచాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. ఇప్పటికే ఓటీఎస్ (వన్ టైం సెటిల్‌మెంట్ పథకం) సంబందించిన జీవో నెం.307ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రటరీ గత నెల 28న జారీచేశారు. వన్ టైం సెటిల్ మెంట్ పథకం ద్వారా చాలా కాలంగా పెండింగ్‌లో నల్లా బిల్లులను ఇప్పటికే వేసిన వడ్డీలను మినహాయించి కేవల అసలైన బిల్లులు మాత్రమే కడితే సరిపోతుందని తెలిపారు. అలాగే నగరవాసులకు నామమాత్రం రూసుములతో మంచినీటిని సరఫరా చేస్తున్న జలమండలికి క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించి ప్రభుత్వానికి సహకరించే బాధ్యత ప్రజలపై ఉందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా జలమండలికి బిల్లులు బకాయి ఉన్న హైదరాబాద్ నగరవాసులకు సువర్ణావకాశం కల్పిస్తుందని తెలిపారు.


 



Tags:    

Similar News