Telangana: సెప్టెంబర్ తర్వాతే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

*కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపిన తెలంగాణ సర్కార్ *కరోనా పరిస్థితులరీత్యా ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదన్న తెలంగాణ సర్కార్

Update: 2021-08-01 02:50 GMT

కేంద్ర ఎన్నికల సంఘం(ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. కరోనా పరిస్థితుల రీత్యా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని మరికొద్ది రోజులు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలనుకోవట్లేదని తెలిపింది. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో లేఖ ద్వారా ప్రభుత్వం ఈ సమాచారాన్ని పంపించింది.

మరోవైపు ఎమ్మెల్యే కోటా పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3తో ముగిసింది. పదవీకాలం ముగిసినవారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. సాధారణంగా గడువు ముగిసే సమయానికి ముందే ఈసీ ఆ ఖాళీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ కోవిడ్ కారణంగా ఎన్నికల సంఘమే కొంత కాలం ఎన్నికలను వాయిదా వేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రకాల కార్యకలాపాలు పునరుద్దరించబడటంతో ఎన్నికల నిర్వహణపై ఈసీ ఆలోచన చేస్తోంది.

Tags:    

Similar News