TS Government Hospitals: కరోనా రోగులతో ప్రభుత్వా దావాఖానా ఫుల్‌..

TS Government Hospitals: తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల బెడ్స్‌ కరోనా రోగులతో నిండిపోయాయి

Update: 2021-04-29 05:54 GMT

ప్రభుత్వ ఆసుపత్రి (ఫైల్ ఇమేజ్)

TS Government Hospitals: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ పరేషాన్‌ కొనసాగుతోంది. అటు ఏ ప్రభుత్వాసుపత్రిని చూసినా కరోనా రోగులతో నిండిపోయాయి. అటు ఆక్సిజన్‌ కొరత కూడా ఉంది. దీంతో ప్రైవేట్‌ ఆసుపత్రుకి వెళ్లిన వారు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల బెడ్స్‌ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో బెడ్స్‌ లేక ఇతర పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. కావాల్సిన వాళ్లకు, లక్షల రూపాయలు చెల్లించిన వారికి బెడ్స్‌ ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతున్నా పాజిటివ్‌ కేసులు తగ్గడం మాత్రం ఆగడం లేదు. దీంతో సరైన సమయంలో వైద్యం అందక పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు.

చెప్పాలంటే.. పేద, మధ్య తరగతి వారికి కరోనా శాపంగా మారింది. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్‌ దొరక్క.. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ వాళ్లు కరోనా వైద్యానికి డబ్బులు చెల్లించలేక నానా బాధలు పడుతున్నారు. కొందరైతే ఆర్థికస్థోమత లేక ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం లభించక ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని కరోనా రోగులకు వర్తించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇక గతంలో కరోనాను సీఎం కేసీఆర్‌ ఆరోగ్య శ్రీలో చేర్చుతామని చెప్పినట్లు ప్రతిపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తప్పుబడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భవ పథకాన్ని అమలు చేయాలని చెబుతున్నారు. మొత్తానికి కరోనా రోగులను దృష్టిలో పెట్టుకోవాలంటున్న ప్రతిపక్ష నేతలు.. ఇప్పటికైనా ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News