Telangana: బూస్టర్ డోస్‌పై తెలంగాణ సర్కార్ కీలక ప్రతిపాదన..!
Telangana: 2వ డోస్ తర్వాత 6 నెలల గడువుకు డిమాండ్.. 18 ఏళ్లు దాటిన అర్హులకు ఇవ్వాలని విన్నపం
Telangana: బూస్టర్ డోస్‌పై తెలంగాణ సర్కార్ కీలక ప్రతిపాదనలు చేసింది. రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని తెలంగాణ సర్కార్ కేంద్రానిక లేఖ రాసింది. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని సూచించింది. ఇక 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో పేర్కొంది.