Kadiyam Srihari Coronavirus Positive: మాజీ డిప్యూటీ సీఎంకు కరోనా
Kadiyam Srihari Coronavirus Positive: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.
EX Deputy CM Kadiyam Srihari Coronavirus Positive: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సామాన్యప్రజలతో పాటు ఎంతో మంది అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మారి బారిన పడక తప్పడం లేదు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రతి పక్షపార్టీకు చెందిన పలువురు నాయకులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి (EX Deputy CM Kadiyam Srihari) కూడా కోవిడ్ బారిన పడ్డారు. కడియంతోపాటు ఆయన గన్‌మెన్, పీఏకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ప్రస్తుతం కడియం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందగా, ఆయన గన్‌మెన్, పీఏలు కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇక తెలంగాణలో ఇప్పటి కరోనా బారిన పడిన నాయకులలో హోం మంత్రి మహమూద్ అలీ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కరోనాను జయించారు. అదే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్, భాస్కర్ రావు, ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు కోవిడ్ బారిన పడ్డారు.
ముఖ్యంగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల్లో కరోనా వైరస్ బారిన పడిన వారిలో వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావు దంపతులకు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో వారు చికిత్స పొందుతున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవలే ఆయన కొడుకు, కోడలు కూడా కోవిడ్ బారిన పడ్డారు.