Minister Harish Rao : నూతన రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే : మంత్రి హరీశ్ రావు

Update: 2020-09-27 09:46 GMT

Minister Harish Rao : తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్ రావు ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే మన భారతదేశమే అని ఆయన అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆధారంగానే ఈ దేశం పరిపాలన సాగిస్తుందని ఆయన అన్నారు. రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆచరణలను పాటిద్దాం అని ఆయన కోరారు. మారుమూల గ్రామాలకు కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక వృద్ధులకు 2000 రూపాయలు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక బీడీ కార్మికులకు పెన్షన్ అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు. లకుడారం గ్రామంలో 350 మందికి పెన్షన్లు ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాని అని ఆయన ఆనందం వ్యక్తం చేసారు. దేశంలో ఎక్కడ చేయలేని 100 పనిని నూతన రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిది, కేసీఆర్ దే అని ఆయన అన్నారు. అదే విధంగా గొల్ల కురుమ వాళ్లకి దసరా వరకు నూతన ఆస్పత్రి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 70 నుంచి 80 లక్షల వ్యయంతో నూతన ఫంక్షన్ హాల్ భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు. నూతన డబుల్ బెడ్రూం నిర్మాణానికి వారి స్థానంలో కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ హయాంలో చేయలేని పనులు తెలంగాణ ప్రభుత్వం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందు రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నూతన మహిళ భవనాన్ని ప్రారంభించారు.

Tags:    

Similar News