TS EAMCET Results 2020 : రేపే టీఎస్ ఎంసెట్ ఫ‌లితాలు

Update: 2020-10-05 14:25 GMT

TS EAMCET Results 2020 : ఇంజనీరింగ్ లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు రాసిన టీఎస్ ఎంసెట్ -2020 ఫ‌లితాలు రానేవస్తున్నాయి. విద్యార్దులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్టీయూ క్యాంప‌స్‌లో విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. విద్యార్ధులు ఎంసెట్ ఫ‌లితాల కోసం https://www.ntnews.com/ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చని తెలిపారు.

ఇక పోతే ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమ‌వారం సాయంత్రం ఖ‌రారైన విష‌యం తెలిసిందే. ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదు చేసేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు అధికారులు అవకాశం ఇచ్చారు. అదే విధంగా అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 12 నుంచి 18 వరకు పరిశీలించనున్నారు. ఉత్తీర్ణులైన విద్యార్ధులు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే అవకాశాన్ని ఈ నెల 12 నుంచి 20 వరకు కల్పించనున్నారు. ఇక మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను 22న కేటాయించనున్నారు. అదే విధంగా ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను 29 నుంచి జరపనున్నారు. తుది విడత ధ్రువపత్రాల పరీశీలనను 30వ తేదీన నిర్వహించనున్నారు. తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లను 30, 31 తేదీల్లో ఇచ్చుకోవచ్చని అధికారులు విద్యార్ధులకు తెలిపారు. తుది విడుత ఇంజినీరింగ్‌ సీట్లను నవంబర్‌ 2న కేటాయించనున్నారు. ఇక అదే విధంగా వచ్చేనెల 4వ తేదీన స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News