Cyber Crime: పోలీసుల డీపీతో కాల్స్‌ వస్తున్నాయా.? నమ్మితే అంతే సంగతులు..

Cyber Crime: పోలీసుల డీపీతో కాల్స్‌ వస్తున్నాయా.? నమ్మితే అంతే సంగతులు..

Update: 2024-07-20 08:27 GMT

Cyber Crime: పోలీసుల డీపీతో కాల్స్‌ వస్తున్నాయా.? నమ్మితే అంతే సంగతులు.. 

Cyber Crime: మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. రోజురోజుకీ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఎంత అవగాహన పెరుగుతోన్నా, ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నేరస్థులు మాత్రం తగ్గడం లేదు. కొంగొత్త మార్గాలను అన్వేషిస్తూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో రకం కొత్త నేరం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి తెలంగాణ డీజీపీ ప్రజలను అలర్ట్‌ చేసింది.

ప్రజల భయాన్ని లేదా అత్యాశను అస్త్రంగా మార్చుకొని నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా పోలీస్‌ డ్రస్‌లో ఉండే వ్యక్తుల డీపీతో కూడిన నెంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఫేక్‌ కాల్స్‌ ద్వారా ప్రజలను ఎలా మోసం చేస్తున్నారన్న వివరాలను స్పష్టంగా ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఇంతకీ ఈ స్కామ్‌ ఎలా జరుగుతుందంటే.

మొదటి మీకు మొదట ఓ నంగర్‌ నుంచి కాల్ వస్తుంది. అయితే సదరు నెంబర్‌కు డీపీగా ఒక పోలీస్‌ ఆఫీసర్‌ ఫొటో ఉంటుంది. దీంతో సహజంగానే మీకు పోలీస్ ఫోన్‌ చేశాడని భ్రమపడుతారు. అనంతరం కాల్‌లో మాట్లాడుతూ.. మీకు సంబంధించిన వ్యక్తులు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్‌ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేతో పెద్ద తప్పుపని చేశారని మిమ్మల్ని టెన్షన్‌లో పెడుతారు. అనంతరం డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

ఇలాంటి కాల్స్‌ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. తొందరపడి డబ్బులు చెల్లించడం లాంటివి చేయకూడదు. అలాగే మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా జైల్లో ఉన్నారని ఫోన్‌ చేస్తే వెంటనే వారికి కాల్ చేసి క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. అలాగే మీరు ఎలాంటి తప్పు చేయకున్నా, మీపై ఏవైనా అభియోగాలు మోపితే.. వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం మంచిదని సూచిస్తున్నారు.


Tags:    

Similar News