Telangana: సీఎస్‌ను సాగనంపడం ఖాయమా?
Telangana CS: త్వరలో తెలంగాణ సీఎస్ మార్పు ఉండబోతుందా?
Telangana CS: త్వరలో తెలంగాణ సీఎస్ మార్పు ఉండబోతుందా? సీఎస్‌ను సాగనంపడం ఖాయమా? సోమేశ్ కుమార్‌ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2017లో ఏపీకి అలాట్ అయిన సోమేశ్ కుమార్ ఆ తర్వాత తాత్కాలికంగా తెలంగాణకు బదిలీ అయ్యారు. ఇదే విషయమై 2017లో DOPT కేసు కూడా నడుస్తోంది. దీనిపై ఇంకా జడ్జిమెంట్ వెలువడలేదు. ఈ నెల 17న క్యాట్ విచారణ జరగనుండటంతో ఎలాంటి తీర్పు రానుందన్న సస్పెన్స్ నెలకొంది.
ఇటీవల సీఎస్ తీరుపై చీఫ్ జస్టిస్ రమణ సీరియస్ కావడం సీఎస్ పై బదిలీ వేటు ఖాయమన్న ప్రచారం ఎక్కువయ్యింది. ధరణి లోపాలతో సోమేశ్ కుమార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయ్. వీఆర్ఏ పే స్కేల్ ఫైల్ తన వద్దే ఉంచుకొని మూవ్ చేయలేదంటూ సీఎస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. బీహార్ ఐఏఎస్‌లకు కేసీఆర్ ప్రయార్టీ ఇస్తున్నారని సీనియర్ ఐఏఎస్‌లు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సీఎస్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని పార్టీలో ప్రచారమూ ఉంది.