రూల్స్ బ్రేక్ చేసే వారి బెండ్ తీస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఈ ఏడాది పెద్ద మొత్తంలో చలాన్లు వసూళ్లు

Traffic Fines in 2021: తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారి బెండ్ తీస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

Update: 2021-12-29 07:08 GMT

రూల్స్ బ్రేక్ చేసే వారి బెండ్ తీస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఈ ఏడాది పెద్ద మొత్తంలో చలాన్లు వసూళ్లు

Traffic Fines in 2021: తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారి బెండ్ తీస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు మీద ఎవ్వరు లేరు క‌దా అని సిగ్నల్ జంప్, ఓవ‌ర్ స్పీడ్ వెళ్లినా ఆటోమెటిక్ కెమెరాల‌ను ఎర్పాటు చేసి చ‌లాన్లు విధిస్తున్నారు. ఇలా ట్రాపిక్ నిబంధ‌నలు అతిక్రమించే వారి పట్ల క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ ఎడాది కూడా పెద్ద మొత్తంలో రూల్స్ బ్రేక్ చేసే వారి వ‌ద్ద చ‌లాన్లు వ‌సూళ్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎడాది చ‌లాన్ల రూపంలో వ‌చ్చిన ఆదాయం ఎంటో ఇప్పుడు చుద్దాం.

ట్రాఫిక్ నిబంధ‌న‌లు అతిక్రమించే వారి ప‌ట్ల క‌ఠినంగా వ్యవ‌హిర‌స్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న వ‌రుస రోడ్డు ప్రమాదాలు, యువ‌కుల ఓవ‌ర్ స్పీడ్ డ్రైవింగ్ త‌దిత‌ర అంశాల‌కు చెక్ పెట్టాలి అంటే చ‌లాన్లు విధించ‌డంతో పాటు కేసులు న‌మోదు చేస్తేనే ఫ‌లితంగా ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. సో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారిపై చ‌లాన్లు విధించ‌డ‌మే కాదు ముక్కుపిండి మ‌రీ వ‌సూళ్లు చేస్తున్నారు. క‌నీసం చ‌లాన్లు విధిస్తున్నారనే భ‌యంతోనైనా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తార‌ని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఎడాది ట్రాపిక్ నిబంధ‌న‌లు అతిక్రమించి వారిపై చ‌లాన్ల రూపంలో దాదాపు 533 కోట్లు విధించారు. ఈ లెక్కన రోజుకు సుమారు కోటిన్నర రూపాయలు చలాన్లుగా విధించారు. ఈ ఎడాది ఎక్కువ‌గా హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం, ఓవ‌ర్ స్పీడ్ , ట్రిపుల్ రైడింగ్ ఈ మూడింటిలో ఎక్కువ‌గా చ‌లాన్లు న‌మోద‌య్యాయి. ముఖ్యంగా సైబ‌రాబాద్ క‌మిషనరేట్ వంటి ప్రాంతాల్లో ఇటీవ‌ల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌ధ్యంలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదాలు జ‌రిగిన‌ప్పుడు హెల్మెట్ ధ‌రించ‌క ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు ఎక్కవగా జ‌రుగుతున్నాయి. అందుకే హెల్మెట్ ధ‌రించ‌క‌పోయినా హాఫ్ హెల్మెట్ ధ‌రించినా సైడ్ మిర్రర్ లేక‌పోయినా చ‌లాన్లు విధిస్తున్నారు.

ఈ ఎడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ ధ‌రించ‌క‌పోవడంతో 1కోటి 10లక్షల 22వేల 37 కేసులు న‌మోదు కాగా 199.17 కోట్ల జ‌రిమానా విధించారు. అతివేగంగా డ్రైవ్ చేసినందుకు గాను 14లక్షల 59వేల 333 కేసులు న‌మోదు కాగా, 145.93 కోట్ల జ‌రిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ కార‌ణంగా 7లక్షల 77వేల 334 కేసులు న‌మోదు కాగా 85.41 కోట్ల జ‌రిమానా విధించారు. ట్రిపుల్ రైడింగ్‌కు సంబంధించి 4లక్షల 61వేల 716 కేసులు న‌మోదు కాగా 55.28 కోట్ల జ‌రిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని కార‌ణంగా 3లక్షల 62వేల 817 కేసులు న‌మోదు కాగా 16.64 కోట్ల జ‌రిమానా విధించారు.

ఓవ‌ర్ లోడింగ్‌తో 2లక్షల 69వేల 669 కేసులు న‌మోదు కాగా, 3.23 కోట్ల జ‌రిమానా విధించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కార‌ణంగా 1లక్ష 41వేల 144 కేసులు న‌మోదు కాగా 14.1 కోట్ల జ‌రిమానా విధించారు. రెడ్ లైట్ జంపింగ్ కార‌ణంగా 1లక్ష 12వేల 957 కేసులు న‌మోదు కాగా, 11.29 కోట్ల జ‌రిమానా విధించారు. సీట్ బెల్ట్ ధ‌రించని కార‌ణంగా 1లక్షల 20వేల 436 కేసులు న‌మోదు కాగా, 1.20 కోట్ల జ‌రిమానా విధించారు. మైనర్ డ్రైవింగ్‌కు సంబంధించి 9,978 కేసులు న‌మోదు కాగా 0.43 జ‌రిమానాలు విధించారు. 

Tags:    

Similar News