21న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. అదే రోజు ఢిల్లీకి సీఎం కేసీఆర్ బృందం
KCR: సీఎం కేసీఆర్ మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.
KCR: సీఎం కేసీఆర్ మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. వరి ధాన్యం అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. వరి ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదో తేల్చుకుందామంటూ ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఎల్లుండి మంత్రులను వెంటబెట్టుకొని హస్తినకు వెళ్లనున్నారు. నేరుగా మోడీని కలిసి వరి ధాన్యం ముచ్చట ఏంటో తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఇటు పార్లమెంట్ వేదికగా కూడా వరి ధాన్యంపై పోరాడటానికి ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.
పంజాబ్ తరహాలో FCI వంద శాతం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేయాలని సూచించారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో మంత్రులతో సుధీర్ఘ మంతనాలు జరిపిన కేసీఆర్.. ఎల్లుండి టీఆర్‌ఎస్ ఎల్పీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఎల్పీ సమావేశం అనంతరం సాయంత్రం కేసీఆర్ మంత్రులతో ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులను కేసీఆర్ బృందం కలవనుంది.