105మందితో టీఆర్ఎస్ తొలి జాబితా.. బీజేపీ టార్గెట్‌గా కేసీఆర్ కార్యాచరణ

Update: 2020-11-18 12:17 GMT

మరికాసేపట్లో GHMC టీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించనున్నారు. 105మందితో తొలి జాబితాను విడుదల చేయనున్నారు. సర్వేలన్నీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయన్న సీఎం కేసీఆర్‌ GHMCలో 110 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ను పట్టించుకోనవసరం లేదని బీజేపీయే టార్గెట్‌గా ప్రచారం నిర్వహించాలని టీఆర్ఎస్‌ ముఖ్యనేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘ మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా కసరత్తు చేశారు. GHMC ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా బీజేపీ టార్గెట్‌గా కేసీఆర్ తన కార్యాచరణను వివరించారు. బీజేపీతో తెలంగాణకు ఎలాంటి లాభం లేదన్న కేసీఆర్‌ దేశంలో బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌ నుంచే బీజేపీపై యుద్ధం మొదలుపెడతామంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తేల్చిచెప్పిన కేసీఆర్ డిసెంబర్‌ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. మమతాబెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, దేవెగౌడ, అఖిలేష్‌ యాదవ్‌తోపాటు బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలతో సమావేశమై పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు జీహెచ్ఎంసీ డివిజన్ల బాధ్యత అప్పగించిన సీఎం కేసీఆర్ ప్రచార అస్త్రాలపై డైరెక్షన్ ఇఛ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని మార్చిపోవాలని నేతలకు సూచించారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసమ్మతులు, అసంతృప్తులతో ఎలా వ్యవహరించాలి విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి ఏయే అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలనే అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ నిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News