తెలంగాణ రైతులకు శుభవార్త.. రేపటి నుంచే రైతుబంధు నిధుల పంపిణీ!

*వీలైనంత త్వరగా నగదు బదిలీ జరగాలని ఆదేశించిన కేసీఆర్ *ఇప్పటికే రూ. 7,500 కోట్లను సర్దుబాటు చేసిన ఆర్థికశాఖ అధికారులు

Update: 2021-12-14 04:53 GMT

తెలంగాణ రైతులకు శుభవార్త.. రేపటి నుంచే రైతుబంధు నిధుల పంపిణీ!

Rythu Bandhu: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. రేపటి నుంచి రైతుబంధు నిధులను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమకానున్నాయి. వీలైనంత త్వరగా రైతులందరి అకౌంట్లలోకి డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రైతుబంధు కోసం దాదాపు రూ. 7,500 కోట్లను సర్దుబాటు చేసేందుకు ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు జమకానుంది. నగదు బదిలీ కార్యక్రమం ఈ నెల చివరి వరకు కొనసాగనుంది. గత వానాకాలంలో తొలి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండు ఎకరాల భూమి ఉన్నవారికి, మూడో రోజు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్నవారికి రైతుబంధు డబ్బును పంపిణీ చేశారు. ఈ సీజన్ లో కూడా అదే పద్ధతిని అవలంభించాలని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News