KCR - Harish Rao: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
* ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కీలక బాధ్యతలు * హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖ అదనపు బాధ్యతలు
KCR - Harish Rao: తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించిన తరువాత ఆయన నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖను కొన్ని నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్న సీఎం కేసీఆర్ తాజాగా ఈ శాఖను ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావుకు అప్పగించారు.
ఈ ఫైల్‌పై గవర్నర్ తమిళి సై సంతకం కూడా చేశారు. ఇప్పటి వరకు ఆర్థిఖ శాఖను మాత్రమే పర్యవేక్షించిన హరీష్ రావు, ఇక నుంచి రెండు శాఖలను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తుండగా హరీశ్ రావుకు ఆరోగ్య శాఖ ఇవ్వడంపై అసలు కారణం ఏంటన్న చర్చ జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి హరీష్ రావు ఏ పదవి అప్పగించిన పదవికే వన్నె తెచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మొదటి ఇరిగేషన్ శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రిగా పని చేశారు. కాళేశ్వరం పూర్తి చేయడం కోసం అహర్నిషలు కష్టపడి పని చేశారు. తెలంగాణ పల్లెలను కలకలలాడించని మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పూడిక తీతచెపట్టారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే లక్ష్యంతో ముందుకు సాగారు మంత్రి హరీష్.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యం విషయంలో ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పిటల్ నిర్మించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ తో పాటు హైదరాబాదు నగరంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఇప్పటికే డిజైన్స్ పూర్తయ్యాయి.
కరోనా సమయంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డ నేపద్యంలో అలాంటి ఇబ్బందులు ప్రైవేట్ హాస్పిటల్ లో పడకుండా ప్రభుత్వ హాస్పిటల్ లోనే పూర్తిస్థాయి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
హరీష్ రావు ఏ శాఖ లో ఉన్న తన ముద్ర వేసుకున్నారని గట్టి నమ్మకం అందులో భాగంగానే ఆరోగ్య శాఖ ఇస్తే రాష్ట్రంలో హాస్పిటల్స్ లో స్థితిగతులు మారుతాయని అని సీఎం భవించారట. అందుకే హరీష్ కి ఆరోగ్య శాఖ ఇచ్చారన్న ప్రచారం జరుగుతుంది.