ఇవాళ ఎల్బీస్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ!

గ్రేటర్‌ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాల గొంతు మూయాలని భావిస్తోంది.

Update: 2020-11-28 06:47 GMT

గ్రేటర్‌ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాల గొంతు మూయాలని భావిస్తోంది. బల్దియా గడ్డపై మరోసారి టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. పార్టీపై విమర్శలు చేస్తున్నవాళ్లకు తనదైన శైలిలో జవాబు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. దీంతో గులాబీ పార్టీపై వరుస విమర్శలు చేస్తున్న బీజేపీ శ్రేణులకు.. కేసీఆర్‌ ఏ విధంగా సమాధానం చెబుతారోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

ఎల్బీస్టేడియంలో సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ ప్రచార సభ ప్రారంభం కానుంది. గ్రేటర్‌లోని 150 డివిజన్ల నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు నిర్దేశించిన వేదికలపైకి చేరుకుంటారు. మరోవైపు సభ కోసం భారీగా జనసమీకరణ చేస్తున్నారు గులాబీ నేతలు. కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. కార్యకర్తలు, నేతలకు శానిటైజ్‌ చేసి మాస్కులు ఇచ్చి సభలోపలికి పంపించనున్నారు. దీనికోసం గేట్ల దగ్గర వాలంటీర్లను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ రాకతో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో తిరిగే వాహనాలను మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలించనున్నారు. సభకు వచ్చేవారి వాహనాలను నిజాం కాలేజీ, మహబూబియా కాలేజీ దగ్గర పార్కింగ్ చే‎‎సుకునే సౌకర్యం కల్పించారు అధికారులు.

Tags:    

Similar News