యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు!
CM KCR Visit Yadadri : యదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనం చేసుకున్నారు. రోడ్డు మార్గం
CM KCR Visit Yadadri : యదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనం చేసుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా కొండ పైకి వెళ్ళిన సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నిబంధనలకి అనుగుణంగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ దర్శనం చేసుకున్నారు కేసీఆర్. అనంతరం పండితులు చతుర్వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు కేసీఆర్ .
యాదాద్రి టెంపుల్ డేవలప్మెంట్ అథారిటీ ( YTDA) వారు ఇటీవల రూపొందించిన ఆలయ నమూనా, క్యూ లైన్ లు, మహామండపం, ద్వారాలు, వాటికి బంగారు తాపడం పనుల గురించి చేసిన వీడియో లను ప్రొజెక్టర్ ద్వారా వీక్షించారు సీఎం కేసీఆర్... యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన, క్యూ లైన్ లు, కల్యాణ మండపం, ఇన్నర్ ప్రకారాలు, ఔటర్ ప్రకారాలు, రామలింగేశ్వర స్వామి ఆలయం, ఆళ్వార్ స్వాముల విగ్రహాలు, ఆలయం మొత్తానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, ఫ్లోరింగ్ , టెంపుల్ సిటీ, రహదారులు, గుట్ట చుట్టూ నిర్మిస్తున్న గిరి ప్రదర్శన రోడ్డులను అణువణువునా పరిశీలించారు కేసీఆర్.
ఇక ఇటీవల తమిళనాడులో ప్రత్యేకంగా చెక్కించి తెప్పించిన ఐరావతం,అశ్వం, విగ్రహాలను పరిశిలించారు. అనంతరం పనుల పురోగతిపై ఆలయ అధికారులతో సమీక్ష జరపనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.