తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో..

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Update: 2022-01-17 13:59 GMT

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం..

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం బోధన కోసం కొత్త చట్టం తీసుకురావాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై అధ్యయనం అనంతరం విధివిధానాల రూపకల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ఇక రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నూతన చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన వసతుల కోసం ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. 7వేల 289 కోట్లతో మన ఊరు- మన బడి ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News