TS Cabinet Meeting: వారం రోజుల్లో తెలంగాణ కేబినెట్‌ భేటి

* కీలక అంశాలపై చర్చించనున్న సీఎం కేసీఆర్ * కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాజకీయ పరిస్థితులపై చర్చ

Update: 2021-11-11 04:18 GMT

తెలంగాణ కేబినెట్‌ భేటి

TS Cabinet Meeting: వారం రోజుల్లో తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, తాజా రాజకీయ పరిస్థితులపై సీరియస్‌గా డిస్కర్షన్‌ చేయనున్నారు.

ఈ భేటితో పంటల సాగుపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు 70 వేల పోస్టుల నియామకానికి పచ్చ జెండా ఊపే ఛాన్స్ ఉంది.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిపై కూడా క్యాబినెట్ లో చర్చించనున్నారు. వరి ధాన్యం కొనుగోలుపై భవిష్యత్‌లో ఏం చేయాలనే విషయంపై కూడా కేబినెట్‌ చర్చించనుంది. ఇతర పంటల వైపు రైతులను ప్రొత్సహించేందుకు రాయితీలు కూడా ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

ఇటు దళితబంధుపై కూడా కేబినెట్‌ మరోసారి చర్చించే అవకాశముంది. వాసాలమర్రి, హుజురాబాద్ తో పాటు 4 మండలాల్లో పూర్తిస్థాయిలో అలాగే 119 నియోజకవర్గాల్లో 100 మందికి దళిత బంధు సాయం అందేలా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీల పెంపు కీలక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్‌. ఇప్పటికే చార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇక కేబినెట్‌ భేటి తర్వాత సామాన్యులకు విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీల భారం తప్పదు.

Full View


Tags:    

Similar News