తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి శోభ.. భారీగా పల్లెబాట పడుతున్న పట్నం వాసులు
Sankranti Rush: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది.
Sankranti Rush: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది. పెద్ద పండుగ వేళ కుటుంబం అంతా కలిసి జరుపుకునేందుకు పట్నం పల్లెకు తరలింది. భాగ్యనగరం నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు, బస్సులు గత నాలుగు రోజులుగా కిక్కిరిసిపోతున్నాయి. రెగ్యులర్ రైళ్లతో పాటు పలు స్పెషల్ ట్రైన్స్ సైతం రెట్టింపు ప్రయాణికులతో బయలుదేరుతున్నాయి.
హైదరాబాద్ నుంచి దాదాపు 3వేల 500 రెగ్యులర్ బస్సులతో పాటు మరో 3వేల 650 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం చేసింది. ఇదే సమయంలో వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్స్ కార్లు, ఇతర వాహనాల్లో సైతం భారీ సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు బయల్దేరి వెళుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు శెలవు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వరుసగా శెలవులు రావడంతో నగర ప్రజలు పల్లెబాట పడుతున్నారు.