తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: కేటాయింపులు ఇలా..
Telangana Budget 2022-23 Highlights: తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీష్‌రావు, సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Telangana Budget 2022-23 Highlights: తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీష్‌రావు, సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలైన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి హరీష్‌రావు నేరుగా బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ 2022-223 బడ్జెట్‌కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
బడ్జెట్ ముఖ్యాంశాలు....
రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు
క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు
దళిత బంధుకు రూ. 17,700 కోట్లు
గ్రామ పంచాయితీలకు ప్రతినెలా రూ. 227.5 కోట్లు
పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు
మన ఊరు, మన బడి కోసం రూ. 3497 కోట్లు
కొత్త మెడికల్ కాలేజీలకు రూ.వెయ్యి కోట్లు
అటవీ యూనివర్సిటీకి రూ.100 కోట్లు
పామాయిల్ సాగుకు రూ.వెయ్యి కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు
హరితహారానికి రూ.932 కోట్లు
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం రూ. 12 వేల కోట్లు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12565 కోట్లు
రోడ్లు భవనాల శాఖకి రూ.1542 కోట్లు, పర్యాటక రంగానికి 1500 కోట్లు
తెలంగాణ పోలీస్ శాఖకి రూ. 9315 కోట్లు
ఇరిగేషన్ శాఖకు రూ. 22675 కోట్లు, అసరాకు రూ.11728 కోట్లు
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌కు రూ.2750 కోట్లు
గిరిజన సంక్షేమానికి రూ.12,565 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ. 5698 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 117 కోట్లు కేటాయింపు
మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల్,యాదాద్రిలో మెడికల్ కాలేజీలు
రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థికసాయం
రాష్ట్రంలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహం
నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు కేటాయింపు
ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇళ్లు
నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43 వేల ఇళ్లు
రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి
హెచ్‌ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలు
బస్తీ దవాఖాలను 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది
కిడ్నీ రోగులకు 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలు
ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు, వరంగల్‌లో హెల్త్ సిటీ
అవయవమార్పిడి చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షలు
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్
ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు 135 నుంచి 550 టన్నులకు పెంచాం
వైరస్ వ్యాప్తి కట్టడిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది
తెలంగాణలో ఊహకందని రీతిలో పంటల దిగుబడి ఉంది
ఐక్యరాజ్యసమితి కూడా రైతు బంధును అభినందించింది
వ్యవసాయ వృద్ధిరేటు 4 శాతం నుంచి 29 శాతానికి పెరిగింది
తెలంగాణ పత్తికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది
3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేశారు
పన్ను ఆదాయం రూ.1,08,212 కోట్లు, కేంద్ర పనుల్లో వాటా రూ.18,394 కోట్లు
పన్నేతర ఆదాయం రూ.25,421 కోట్లు, గ్రాంట్లు రూ.41,001 కోట్లు
రుణాలు రూ.25,970 కోట్లు, అమ్మకం పన్ను అంచనా రూ.33 వేల కోట్లు
ఎక్సైజ్ ఆదాయం రూ.17,500 కోట్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ.15,600 కోట్లు
ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ మార్క్ బడ్జెట్
2021-22 నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,54,860 కోట్లు
2015-16 నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువ
2015-16 నంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి
ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామి
తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధిరేటు 11.1 శాతంగా అంచనా
దేశ జీడీపీ వృద్ధి రేటు 19.14 శాతంగా అంచనా
తెలంగాణలో 84 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.18,500 కోట్లు ఖర్చుచేశాం
నమ్మక్క- సారక్క బ్యారేజీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది
గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించి 5 నెలలైనా...
కేంద్రం ఇప్పటికి క్లియరెన్స్ ఇవ్వలేదు
తెలంగాణలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు
కృష్ణా జిలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేల్చలేదు