BJP-Janasena: తెలంగాణలో జనసేనతో పొత్తుకు బీజేపీ కసరత్తు
BJP-Janasena: పొత్తుపై క్లారిటీ వచ్చాకే సెకండ్ లిస్ట్ విడుదల?
BJP-Janasena: తెలంగాణలో జనసేన పార్టీతో పొత్తుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే జనసేన అధినేత పవన్‌తో టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశమై పొత్తు గురించి చర్చించారు. ఈ నేపథ్యంలో మరోసారి పవన్‌తో టీబీజేపీ నేతలు సమావేశం అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈనెల 27న బీజేపీ అగ్రనేత అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశం తర్వాత జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
తెలంగాణలో తమ పార్టీ పోటీ చేస్తుందంటూ రీసెంట్‌గా జనసేన ప్రకటించింది. దాంతో జనసేనను కలుపుకొనే బరిలో దిగాలని కమలనాథులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పవన్‌ను కలిశారు. అయితే గతంలో ఏపీ ఎన్నికల్లో, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేశామని.. ఈసారి జరిగే తెలంగాణ ఎన్నికల్లో తాము పోటీ చేయడం అనివార్యమని పవన్ తెలిపారు. కనీసం 20 సీట్లలో అయినా జనసేన పోటీ చేయాలని భావిస్తుంగా.. బీజేపీ అధిష్టానం మాత్రం 6 నుంచి 8 సీట్లు సర్దుబాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో సెటిలర్లు ఉన్న నియోజకవర్గాలతో పాటు... ఖమ్మం, నల్గొ్ండ జిల్లాల్లో కొన్ని సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ 52 మందితో తొలి జాబితా ప్రకటించగా.. జనసేనతో పొత్తుపై క్లారిటీ వచ్చాకే సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.