Telangana Assembly : తెలంగాణా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈరోజు
తెలంగాణా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈరోజు నిర్వహించనున్నారు.
ఈరోజు నాలుగు చట్టాల సవరణ కోసం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11గంటలకు 40నిమిషాల సభ ప్రారంభం అవుతుంది. ప్రత్యెక సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు రద్దు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో... అవసరమైన జాగ్రత్తలు తీసుకున్న అధికారులు. ఎమ్మెల్యేల మద్య భౌతికదూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేసిన అధికారులు.
నాలుగు చట్టాల సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదముద్ర వేసిన నాలుగు ముసాయిదా బిల్లులు ఈరోజు సభ ముందుకు రానున్నాయి.
1)ఇండియన్ స్టాంప్ బిల్ 2020.. 2)తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ బిల్ 2020 సభలో ఈ 2 బిల్లులు ప్రవేశ పెట్టనున్న సీఎం కేసీఆర్
3)జిహెచ్ఎంసి సవరణ బిల్లు 2020 ప్రవేశ పెట్టనున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
4)క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్ 2020 ప్రవేశ పెట్టనున్న న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
ఈరోజు శాసనసభలో ప్రవేశ పెట్టనున్న బిల్లుల వివరాలు ఇవే..
బిల్ నెంబర్ ( 1)
భూముల ప్రాథమిక విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేయనున్నారు.
బిల్ నెంబర్ (2)
వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా బదలాయించేందుకు అధికారులకు విచక్షణాధికారాలు రద్దు చేయడం.
ధరణి ద్వారానే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించనున్నారు.
వ్యవసాయేతర ఆస్తులకు కూడా గుర్తింపు సంఖ్య ఇచ్చేలా చట్టానికి సవరణలు సీఎం కేసీఆర్ ప్రతిపాదించనున్నారు.
బిల్ నెంబర్ (3)
జిహెచ్ఎంసి చట్ట సవరణ లో కీలక అంశాలు
ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు పూర్తి జవాబుదారీతనం, బాధ్యతలు చట్టంలో నిబంధనలు చేర్చనున్నారు.
విధులు సక్రమంగా నిర్వహించని ప్రజాప్రతినిధులు, అధికారులను తొలగించేలా కఠిన నిబంధనలు తీసుకురానున్నారు.
పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత,
పదిశాతం హరిత బడ్జెట్,
వార్డు కమిటీల ఏర్పాటు పనివిధానంలో మార్పులు
సమీకృత టౌన్‌షిప్‌ల అభివృద్ధి,
రెండు దఫాలుగా ఒకే రిజర్వేషన్ అమలు సహా జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలను మంత్రి కేటీఆర్ ప్రతిపాదించనున్నారు.
బిల్ నెంబర్ (4)
హైకోర్టు సూచన మేరకు నిందితులకు పూచీకత్తు అంశానికి సంబంధించిన సీఆర్పీసీ చట్టాన్ని సవరించనున్నారు.
ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిపాదించనున్నారు.
ఈ చట్టసవరణ బిల్లులపై శాసనసభలో చర్చించిన అనంతరం ఆమోదిస్తారు.
ఇదే బిల్లులపై రేపు (బుధవారం) శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది.