తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రశ్నోత్తరాలు.. జీరో అవర్ అనంతరం పలు బిల్లులను ప్రవేశపెట్టి సభ ఆమోదించే అవకాశాలున్నాయి. శాసనమండలిలో కరోనాపై చర్చ జరుగనున్నది. ఉదయం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఉండనున్నది. శుక్రవారం రెవెన్యూ బిల్లుపై చర్చిస్తారు. రోజంతా సభ జరిగే అవకాశం ఉంది. కాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి.