నేడు తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం.. విఆర్ఓ వ్యవస్థ రద్దు?
నేడు తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశం కానుంది. ఈ సందర్బంగా సభలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు ..
నేడు తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశం కానుంది. ఈ సందర్బంగా సభలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు ముఖ్యమైన బిల్లులను సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్(VRO) బిల్, 2020 అలాగే.. తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మరో రెండు ముఖ్యమైన బిల్లులను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు లు ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెడతారు.. ఇక పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018 సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ కీలక బిల్లులు కాక కరోనాపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
అదేవిధంగా శాసనసభలో ఆరు ప్రశ్నలు చర్చకు రానున్నాయి. అవి ఇలా ఉన్నాయి.. 1) కళ్యాణ లక్ష్మి పథకం, 2) టీ హబ్ విజయాలు, 3) వక్ఫ్ భూముల సర్వే, 4) ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు వంతెనలు మరమ్మతులు, 5) మత్స్యకార సహకార సంఘాలు చేప పిల్లలు, 6) ఎకో టూరిజం గా నల్లమల్ల అటవీ ప్రశ్నలు సభ్యులు అడగనున్నారు. ఇక శాసనమండలిలో చర్చకు రానున్న ప్రశ్నల జాబితా ఇలా ఉంది. 1) బిందుసేద్యం క్షేత్ర యాంత్రీకరణ పథకం, 2) ఆరవ దశ హరితహారం, 3) కోవిడ్-19 చికిత్సకోసం ఔషధాల సేకరణ, 4) గ్రామ పంచాయతీల్లో బిటి రోడ్లు నిర్మాణం, 5) అవర్లి బెస్ట్ ఉపాధ్యాయులు, 6) ప్రభుత్వ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తీర్ణత వంటి ప్రశ్నలను సభ్యులు లేవనెత్తనున్నారు.