తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఈ నెలలో మరో రెండు రోజుల పాటు నిర్వహించనుంది. రేపటి నుంచి అంటే సోమ, మంగళవారాల్లో 12, 13వ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను జరుగనున్నాయి. ఈ మేరకు సమావేశాల ఏర్పాట్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. సోమవారం జరిగే సమావేశాల్లో సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేయాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా సమావేశాల బందోబస్తుపై డీజీపీ, సీపీతో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. శాసన సభ ప్రాంగణం, సభ లోపల శానిటైజేషన్ చేయించాలని సూచించారు. సభ్యులు, సిబ్బంది, పోలీసులు కరోనా మహమ్మారి నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం చేయించుకోవాలని వారు సూచించారు. నిర్ధారణ పరీక్షల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు, కనిపిస్తే వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
ఇకపోతేత్వరలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరుగున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఏర్పాట్ల పరిశీలనఈ నేపథ్యంలో ఎన్నికల ముందుగానే చట్టాలను సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చట్టాల్లో కొన్ని సవరణల బిల్లుకు, హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లోనూ చట్టాలు చేయాల్సి ఉన్నందున అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. నవంబర్, డిసెంబర్‌లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.