Nizamabad CP: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేశాం
Nizamabad CP: 750 మంది పోలీస్ సిబ్బంది..మరో 9 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత
Nizamabad CP: నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ కల్మేశ్వర్ తెలిపారు. 24 గంటల పాటు నిఘా బృందాలు ఏర్పాటు చేసిన పనితీరును కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించేలా PTZ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా 750 మంది పోలీస్ సిబ్బంది.. మరో 9 కంపెనీల కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని సీపీ కల్మేశ్వర్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేశామంటున్న నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్.