Telangana: మంత్రులు, ఎమ్మెల్యేల‌కు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం క్యాబినెట్ సమావేశం కానుంది.

Update: 2021-03-17 02:48 GMT

కెసిఆర్ (ThehansIndia)

Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం క్యాబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ బడ్జెట్ కి ఆమోద ముద్ర వేయడం తో పాటు పిఆర్సీ ప్రకటనపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోద ముద్ర అనంతరం ప్రభుత్వం అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు , ఎమ్మెల్యే లకు అధినేత ఎం దిశ నిర్దేశం చేయనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో బడ్జెట్ అంచనాలపై భారీగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటాయింపు ఎంత ఉండనున్నవి అనేది ఆసక్తిగా మారింది. గత బడ్జెట్ తో పోలిస్తే దాదాపు 15 శాతం ఎక్కువ కేటాయింపులు పెట్టె అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాదాపు 2 లక్షల కోట్ల చేరువలో రాష్ట్ర బడ్జెట్ ఉండనుంది. ఇవాళ సాయంత్రం జరుగనున్న క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్ కి ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక అంశాల పై చర్చ జరుగనుంది.

బడ్జెట్ లో కేటాయింపులతో పాటు నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారని చర్చ జరుగుతుంది. అదేవిధంగా 50 వేల ఉద్యోగాల భర్తీపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. భైంసా లో వరుసగా జరుగుతున్న ఘటనలపై బిజెపి ఎమ్మెల్యేలు సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో సరైన సమాధానం ఇవ్వాలని  మంత్రులకు సూచించనున్నారు సీఎం కేసీఆర్.

కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంపై సభలో ఏవిధంగా వ్యవహిరంచాలన్న దానిపై దిశ నిర్దేశం చేయనున్నారు సీఎం. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభ ఏక గ్రీవ తీర్మానం చేయాలని కాంగ్రెస్ పార్టీ సభలో పట్టు బట్టే అవకాశం ఉన్నందున దానిపై ధీటైన సమాధానం ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. పసుపు బోర్డ్ అంశం పై కేంద్రం ఇచ్చిన సమాధానం ని బీజేపీ ఎమ్మెల్యే లు కేంద్రం వద్దకి వెళ్లాలని సభలో ప్రశ్నించనున్నారు మంత్రులు.

సభలో ఇతర పార్టీల నేతలు అడిగే ప్రశ్న లకు సమాధానాలు ఇస్తూ...రాష్ట్రంలో చేసిన ప్రతి అభివృద్ధిని ప్రజలకు వివరించేలా సభను ఉపయోగించుకోవాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచనలు చేయనున్నారు.

Tags:    

Similar News